గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్‌ అధికారుల దాడులు | - | Sakshi
Sakshi News home page

గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్‌ అధికారుల దాడులు

Jul 29 2026 1:46 AM | Updated on Jul 29 2026 1:46 AM

180 కేజీల నల్లబెల్లం,

40 కేజీల పటిక స్వాధీనం

కొండమల్లేపల్లి : మండల పరిధిలోని మేఘ్యతండా, పన్నితండా, ఆంగోత్‌తండా, కేశ్యతండా, దేవరకొండ మండలంలోని మర్రిచెట్టుతండాలలోని గుడుంబా స్థావరాలపై మంగళవారం దేవరకొండ ఎకై ్సజ్‌ సీఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఎకై ్సజ్‌ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 600 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. 180 కేజీల నల్లబెల్లం, 40 కేజీల పటిక స్వాధీనం చేసుకున్నారు. నాలుగు లీటర్ల గుడుంబాను సీజ్‌ చేసినట్లు ఎకై ్సజ్‌ సీఐ తెలిపారు. నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఇద్దరిని అరెస్టు చేసి, ముగ్గురిని బైండోవర్‌ చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో నల్లగొండ ఎకై ్సజ్‌ ఎస్‌ఐ, నాంపల్లి ఎకై ్సజ్‌ ఎస్‌ఐ, దేవరకొండ ఎక్సైజ్‌ ఎస్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు.

గంజాయి రవాణా

కేసులో ఇద్దరికి జైలు శిక్ష

ఖమ్మంలీగల్‌ : గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన కేసులో సూర్యాపేటకు చెందిన ఆలేటి గణేష్‌, బట్టు హరీష్‌కు పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పుల్లబత్తుల పొగడ కృష్ణఅర్జున్‌ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం వివరాలు.. 2022 ఏప్రిల్‌ 10న ఖమ్మం కొత్త బస్టాండ్‌ వద్ద అప్పటి ఖమ్మం–1 ఎకై ్సజ్‌ సీఐ రాజు, ఎస్సైలు రవి, షేక్‌ రబ్బానీ తనిఖీ చేపట్టారు. ఈక్రమాన ద్విచక్ర వాహనంపై ఏడు కేజీల గంజాయి తరలిస్తూ సూర్యాపేటకు చెందిన కానుక్కుర్తి సాయినవీన్‌, నేరెళ్ల శ్రీరాములు, గణేష్‌, హరీష్‌ పట్టుపడ్డారు. కేసును ఎకై ్సజ్‌ అధికారులు దర్యాప్తు చేసి కోర్టులో చార్జీషీట్‌ ధాఖలు చేశారు. ఈ కేసు విచారణ అనంతరం సాయినవీన్‌, శ్రీరాములుకు పదేళ్ల చొప్పున జైలుశిక్ష, రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌ 12న న్యాయమూర్తి ఉమాదేవి తీర్పు చెప్పారు. అయితే, అప్పుడు పరారీలో గణేష్‌, హరీష్‌కు సైతం అదే శిక్ష విధిస్తూ న్యాయమూర్తి పొగడకృష్ణ అర్జున్‌ మంగళవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్‌ తరుపున ఏపీపీ జమ్ముల శరత్‌కుమార్‌రెడ్డి వాదించారు.

ఆదర్శ రైతు పద్మారెడ్డికి ఘన సన్మానం

చందంపేట : కుంకుడు రైతుగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నల్లగొండ జిల్లాకు చెందిన ఆదర్శ రైతు లోకసాని పద్మారెడ్డికి మరో అరుదైన గౌరవం దక్కింది. చందంపేట మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన పద్మారెడ్డి తన వ్యవసాయ భూమిలో కుంకుడుతో పాటు 40 ఏళ్లుగా బత్తాయి సాగు చేస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ కేంద్రంగా ఉన్న ఐసీఏఆర్‌–కేంద్ర సిట్రస్‌ పరిశోధనా సంస్థ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిమ్మజాతి (సిట్రస్‌) పంటల అభివృద్ధికి శ్రమించిన రైతులను సత్కరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సిట్రస్‌ సాగులో పద్మారెడ్డి విశిష్ట సేవలను గుర్తిస్తూ నాగపూర్‌లోని ఐకార్‌ కేంద్రంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయనను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా అకోలాలోని పంజాబ్రావ్‌ దేశ్‌ముఖ్‌ కృషి విద్యాపీఠ్‌ వైస్‌ చాన్స్‌లర్‌ శరద్‌ ఆర్‌ గడఖ్‌ చేతుల మీదుగా పద్మారెడ్డి ప్రశంసాపత్రం అందుకున్నారు. ఆయన క్షేత్రంలో ఉన్న 40 ఏళ్ల నాటి బత్తాయి తోట దేశంలోనే ఓ రికార్డు కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement