హుజూర్‌నగర్ : దేశంలో సైద్ధాంతిక ప్రమాణాలు కలిగిన ఏకై క పార్టీ బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం హుజూర్‌నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన జనసంఘ్, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో బీజేపీ బలమైన పార్టీగా ఎదుగుతుందని అన్నారు. తెలంగాణలోనూ బీజేపీ బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని విద్యావంతులు, దేశం కోసం పనిచేయాలనుకునే వారు ఎంతో మంది బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. దక్షిణాది, ఉత్తరాది అంటూ దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. దేశాన్ని ఎందరో విదేశీయులు వందల సంవత్సరాలు పరిపాలించినప్పటికీ హైందవ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని మార్చలేకపోయారని పేర్కొన్నారు. విదేశీ శక్తులు మన దేశంలో రాజకీయ అస్థిరత కోసం ఫండింగ్ కూడా పంపిస్తున్నారని ఆరోపించారు. సర్ కార్యక్రమం గురించి కొన్ని పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. అలాంటి వారి వల్ల దేశంలోని శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. దేశ సేవ కోసం ముందుకు వచ్చే వారిని కార్యకర్తలు గుర్తించి వారిలో జాతీయ భావాన్ని పెంపొందించి, కొత్త వాళ్లను పార్టీలోకి తీసుకువచ్చే ఆలోచన చేయాలని కోరారు. త్వరలో తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి రానుందని చెప్పారు. ఈ సందర్భంగా జనసంఘ్‌లో పనిచేసిన వారిని, ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన వారిని, కరసేవలకు వెళ్లి జైలుపాలైన వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంత కుమార్, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతరెడ్డి, ఆరోగ్య భారతి ప్రాంత సభ్యులు డాక్టర్ రంగాచార్యులు, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సంఘచాలక్ అంకతి అప్పయ్య, జిల్లా నాయకులు చందా సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొబ్బా భాగ్యరెడ్డి, నాయకులు కొండ హరీష్‌గౌడ్, కవితారెడ్డి, కడెం రామచంద్రయ్య, కనగాల వెంకట రామయ్య, నూనె సులోచనతో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, జిల్లా పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు


