ఘనంగా కార్గిల్‌ విజయ్‌ దివస్‌ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా కార్గిల్‌ విజయ్‌ దివస్‌

Jul 27 2026 1:42 AM | Updated on Jul 27 2026 1:42 AM

నల్లగొండ : నల్లగొండలోని మాజీ సైనికుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం కార్గిల్‌ విజయ్‌ దివస్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు, వీరమరణం పొందిన జవాన్ల కుటుంబ సభ్యులు, కార్గిల్‌ అమరవీరులకు నివాళులర్పించారు. కార్గిల్‌ యుద్ధంలో వీరమరణం పొందిన బి.గోపయ్యచారి సతీమణి పి.శారద, మిఠ శ్రీనివాస్‌రెడ్డి తల్లిదండ్రులు నర్సింహారెడ్డి–మణెమ్మ, లాన్స్‌ నాయక్‌ షేక్‌ ఇమామ్‌ తండ్రి షేక్‌ అహ్మద్‌, యుద్ధంలో గాయపడిన శ్రీధర్‌రెడ్డిని నల్లగొండ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో యర్రమాద శ్రీనివాసులు శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు సంది పాపిరెడ్డి, కె.వెంకటాచారి, సంది శ్రీనివాస్‌రెడ్డి, కత్తి భాస్కర్‌రెడ్డి, బొల్లేపల్లి సత్యనారాయణరాజు, జి.రాములు, కె.కోటేష్‌, మహ్మద్‌ అబ్దుల్‌ సమీర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement