శాలిగౌరారం : ప్రభుత్వం నడిపిస్తున్న 108, 102 అంబులెన్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ అన్నారు. శాలిగౌరారం పీహెచ్‌సీ ఆవరణలో ఉన్న 108, 102 అంబులెన్స్‌లను ఆయన శనివారం తనఖీ చేశారు. ఈ సందర్భంగా 108 వాహనంలోని అత్యవసర మందులు, వైద్య పరికరాలు, స్టాక్ రిజిస్టర్, కేసుల రికార్డులను పరిశీలించారు. మండలం నుంచి వచ్చే అత్యవసర వైద్య కేసుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల వైద్యాధికారి సూర్యశిల్పతో సమావేశమయ్యారు.


