ప్రజా సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలు పరిష్కరించాలి

Jul 26 2026 3:14 AM | Updated on Jul 26 2026 3:14 AM

నల్లగొండ : పేదలను ఇబ్బందులకు గురి చేయకుండా వారి సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలోని క్యాంపు కార్యాలయం (ఇందిరా భవన్‌)లో వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను విన్న అనంతరం మంత్రి పలువురు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. కొందరి బాధితుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.

మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గంలో భూ ఆక్రమణలు అడ్డూఅదుపు లేకుండా సాగుతున్నాయి. మిర్యాలగూడ, దామరచర్ల, వేములపల్లి, అడవిదేవులపల్లి మండలాల్లో గుట్టలు కబ్జాదారుల పాలవుతున్నాయి. వందల ఎకరాల్లో వెలిసిన గుట్టలు, ఏనెలను యథేచ్చగా తవ్వి మట్టి దందా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ భూములను చదును చేసి ఆక్రమిస్తున్నారు. ఒకవైపు భూమి కబ్జా, మరోవైపు మట్టిదందా నిరంతరంగా సాగుతుండడంతో భవిష్యత్‌లో గుట్టలు కనుమరగయ్యే అవకాశం కనిపిస్తోంది. వీటిని కాపాడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ మాజీ సైనికుడికి కేటాయించిన భూమి కూడా ఆక్రమణకు గురికావడం విస్మయం గొల్పుతోంది.

రాత్రింబవళు మట్టి దందా..

దామరచర్ల, అడవిదేవులపల్లి, మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న గుట్టలను అభివృద్ధి పనుల పేరుతో తవ్వి మట్టి దందా చేస్తున్నారు. గుట్టలను తవ్వి టిప్పర్ల ద్వారా రాత్రింబవళ్లు వెంచర్లకు, ఆంధ్రా ప్రాంతానికి తరలిస్తున్నారు. స్థానికులు ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా నామమాత్రపు తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు.

● గతంలో అవంతీపురం, ఆలగడప గ్రామాల్లోని గుట్టలతోపాటు కొత్తగూడెం శివారులోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్‌ 34, 36, 38లలో ఏనెను తొలగించి మట్టిని తరలించినట్లు స్థానికులు అంటున్నారు.

● దామరచర్ల మండలం రాళ్లవాగుతండా వద్ద అద్దంకి– నార్కట్‌పల్లి రహదారికి ఆనుకుని ఉన్న గుట్టను కనుమరుగు చేశారు.

● ప్రస్తుతం మిర్యాలగూడ మండలం కాల్వపల్లి శివారులోని సర్వే నంబర్‌ 198లో వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న గుట్టలను కొన్ని రోజులుగా తవ్వి పొలాలుగా మార్చుతున్నారు. ఇక్కడ ఇప్పటికే ఒక గుట్టలో 50 ఎకరాల మేరకు తవ్వకాలు చేపట్టారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

ఫ ఏనెలు, గుట్టలను తవ్వి చదును చేస్తున్న ఆక్రమణదారులు

ఫ మట్టి దందా చేస్తూ రూ.లక్షల్లో సంపాదన

ఫ ఓ మాజీ సైనికుడికి కేటాయించిన భూమి కూడా కబ్జా

ఫ పట్టించుకోని రెవెన్యూ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement