శాకంబరీ నమోస్తుతే.. | - | Sakshi
Sakshi News home page

శాకంబరీ నమోస్తుతే..

Jul 26 2026 3:14 AM | Updated on Jul 26 2026 3:14 AM

గడువులోగా పూర్తి చేయండి..

కాల్వపల్లి శివారులో ఆక్రమణకు గురైన గుట్ట

నిడమనూరు : వర్షాలు పడాలి, కృష్ణమ్మ వరద పావాలి, సాగు సాగాలని ఆకాంక్షిస్తూ నిడమనూరు మండలంలోని నారమ్మగూడెం గ్రామంలో మహిళలు బొడ్రాయికి, శివలింగానికి శాస్త్రోక్తంగా పూజలు చేసి జలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వల్లభారెడ్డి, మాజీ సర్పంచ్‌ దుబ్బాకుల రాంరెడ్డి, గోవింద్‌రెడ్డి, బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, రమణారెడ్డి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

నల్లగొండ : జిల్లాలో రేషన్‌ కార్డుదారుల ఈ–కేవైసీ ప్రక్రియ ఇంకా 80.08 శాతం మాత్రమే పూర్తయింది. బోగస్‌ రేషన్‌ కార్డుల ఏరివేతతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల క్రితం ఈ–కేవైసీని తప్పనిసరి చేసింది. ప్రారంభంలో వేగంగా సాగిన ఈ ప్రక్రియ తర్వాత మందగించింది. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కేవలం 80.08 శాతం మాత్రమే ఈ–కేవైసీ పూర్తయింది. మిగిలిన వారు ఈ నెల జూలై 31వ తేదీలోగా తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

మొత్తం 16,45,775 యూనిట్లు

జిల్లాలోని 33 మండలాల్లో మొత్తం 16,45,775 యూనిట్లు ఉండగా, ఇప్పటివరకు 13,17,995 మంది మాత్రమే ఈ–కేవైసీ పూర్తి చేసుకున్నారు. ఇంకా 3,27,780 మంది నమోదు చేసుకోవాల్సి ఉంది. రేషన్‌ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు వ్యక్తిగతంగా రేషన్‌ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్‌ ధ్రువీకరణతో ఈ–కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం లబ్ధిదారులకు స్మార్ట్‌ కార్డులను పంపిణీ చేయనుంది.

డీలర్లు షాపులు తెరిచి ఉంచాలి..

ఈ నెల రేషన్‌ బియ్యం పంపిణీ పూర్తయిన నేపథ్యంలో జిల్లాలోని అన్ని రేషన్‌ డీలర్లు దుకాణాలను తెరిచి లబ్ధిదారుల ఈ–కేవైసీని చేపట్టాలని జిల్లా పౌర సరఫరాల అధికారి (డీఎస్‌ఓ) వెంకటేశం ఆదేశించారు. రాబోయే రేషన్‌ పంపిణీకి ముందే జిల్లాలో 100 శాతం ఈ–కేవైసీ పూర్తి చేయాలని, ఇందుకు మండల తహసీల్దార్లు కూడా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.

బోగస్‌ కార్డులపై ఫోకస్‌..

ఈ–కేవైసీ ప్రక్రియ ద్వారా ఇప్పటికే పలువురు బోగస్‌ లబ్ధిదారులను గుర్తించడంతోపాటు మరణించిన వారి పేర్లను కార్డుల నుంచి తొలగించారు. ఇంకా ఈ–కేవైసీ చేయించుకోని వారిలో కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉండొచ్చు, మరికొందరు అర్హులు కాకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడువులోగా ఈ–కేవైసీ పూర్తి చేయని వారి పేర్లను రేషన్‌ కార్డుల నుంచి తొలగించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

జూలై 31వ తేదీలోగా రేషన్‌ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలి. గడువు దాటితే రేషన్‌ సదుపాయాలు కోల్పోయే అవకాశం ఉంది. మిగిలిన లబ్ధిదారులు వెంటనే సమీప రేషన్‌ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్‌ ధ్రువీకరణ పూర్తి చేసుకోవాలి. – వెంకటేశం, డీఎస్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement