4న ‘చేనేత’ అవగాహన సదస్సు | - | Sakshi
Sakshi News home page

4న ‘చేనేత’ అవగాహన సదస్సు

Jul 26 2026 3:14 AM | Updated on Jul 26 2026 3:14 AM

నల్లగొండ టౌన్‌ : నూతనంగా ఎన్నికై న చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులకు హైదరాబాద్‌లో ఆగస్టు 4న చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్‌ తెలిపారు. శనివారం నల్లగొండలోని చర్లపల్లి చేనేత సహకార సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ చేనేత కార్మిక సంఘం.. చేనేత కార్మికులు, చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం నిరంతరాయంగా ఉద్యమిస్తోందన్నారు. హైదరాబాద్‌లో జరగనున్న చేనేత సదస్సుకు చేనేత కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ముషం రవి, గంజి రమేష్‌, గంజి రమేష్‌, రాపోలు శేషమ్మ, రాపోలు గణేష్‌, చిట్టిపోలు రమేష్‌, కటకం వెంకటేశ్వర్లు, రాపోలు భిక్షం, గంజి వెంకమ్మ, రాపోలు శ్రీను, దేవలపల్లి సత్తయ్య పాల్గొన్నారు.

‘జలసిరి’తో భూగర్భ జలాల పెంపు

చిట్యాల : భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జలసిరి కార్యక్రమం చేపట్టిందని స్టేట్‌ ఎస్‌బీఎం(స్వచ్చ భారత్‌ మిషన్‌) కో ఆర్టినేటర్‌ శ్రీధర్‌ పేర్కొన్నారు. చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో శనివారం జలసిరి కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విబీజీ–రాంజీ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులు తమ వ్యవసాయ భూముల్లో ఫాం ఫాండ్లు, నీటి కందకాలను, బోర్‌వెల్‌ రీచార్జ్‌ నిర్మాణాలను చేపట్టాలని సూచించారు. ఈ పనులకు ప్రభుత్వమే నిధులు కేటాయింస్తుందని తెలిపారు. ఈ పనుల ద్వారా కరువు పరిస్థితుల్లో భూగర్భ జలాలు పెంపొందడంతో పాటు గ్రామీణ ప్రాంత కూలీలకు ఉపాధి అవకాశాలు పెరుగుతా యని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పాండు, సర్పంచ్‌ అందె ఆండాలు రాములు, పంచాయతీ కార్యదర్శి గోలి మల్లేష్‌, క్యూసీ వినోద్‌కుమార్‌, జక్కల సీనయ్య, బాతరాజు శోభ, సింగిరెడ్డి శోభారాణి, మేడి శైలజ పాల్గొన్నారు.

ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి

పెద్దఅడిశర్లపల్లి : ప్రతి ఇంటా ఇంకుడుగుంత నిర్మించుకోవాలని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అంగడిపేట ఎక్స్‌రోడ్‌ వద్ద జలసిరిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 2 ఊట కుంటలు, 5 కమ్యూనిటీ సోక్‌ ఫీట్లు, 10 బోర్‌వేల్‌ రీచార్జ్‌ నమూనాలు, 5 ఫారం ఫౌండ్స్‌, రూప్‌టాప్‌ రీచార్జ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట సర్పంచ్‌ రమావత్‌ చిరంజీవి, ఎంపీడీఓ చంద్రమౌళి, ఈసీ రాజు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement