మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డకు చెందిన ఓ మాజీ సైనికుడు తనకు భూమిని కేటాయించాలని 2021లో అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరగగా.. 2024లో మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో సర్వే నంబర్ 174లో మూడు ఎకరాల మేరా ఏనెను సర్వే చేశారు. ఏనెకు సంబంధించిన రిపోర్ట్‌ను సంబంధిత సబ్ కలెక్టర్ పరిశీలించి కలెక్టర్‌కు నివేదిక పంపారు. జిల్లాలో కలెక్టర్లు మారడంతో ఆ రిపోర్ట్‌ను అనుమతించేందుకు రెండేళ్లు సమయం పట్టింది. తీరా ప్రస్తుత కలెక్టర్ పరిశీలించి మూడు నెలల క్రితం సీసీఎల్‌ఏకు నివేదిక సమర్పించారు. ఇప్పటికే ఆ భూమి సగానికి పైగా కబ్జాకు గురైంది. ఆ భూమిని చదును చేసుకుని పొలాలుగా మార్చారు. దేశానికి సేవ చేసిన సైనికుడికి దక్కాల్సిన భూమి మొత్తం ఆక్రమణకు గురైంది. నియోజకవర్గంలోని దామరచర్ల మండలంలో ప్రభుత్వ, ఈనామ్, సీలింగ్ భూములు వేలాది ఎకరాల సారవంతమైవి ఉన్నప్పటికీ అధికారులు మాత్రం పనికిరాని ఏనెను కేటాయించడం.. అది కూడా ఆక్రమణకు గురికావడంపై మాజీ సైనికుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.


