నల్లగొండ టౌన్ : ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జికి నిరసనగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండలోని గడియారం సెంటర్‌లో రాసారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు మల్లం మహేష్, ఖమ్మంపాటి శంకర్, ఇందూరి సాగర్, ముదిగొండ మురళికృష్ణ, అంజన్ కుమార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


