మెడికల్‌ వ్యర్థాలు చెత్తలో కలపొద్దు | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ వ్యర్థాలు చెత్తలో కలపొద్దు

Jul 25 2026 1:11 AM | Updated on Jul 25 2026 1:11 AM

నల్లగొండ టూటౌన్‌ : బయో మెడికల్‌ వ్యర్థాలను సాధారణ చెత్తలో కలపడం నేరమని నీలగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ వంశీకృష్ణ అన్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) వైద్యులతో శుక్రవారం తన చాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు, ల్యాబ్స్‌, డెంటల్‌ క్లినిక్‌లు, వెటర్నరీ ఆసుపత్రుల నుంచి వెలువడే బయో మెడికల్‌ వ్యర్థాలను శాసీ్త్రయ పద్ధతిలో సేకరించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.ప్రదీప్‌రెడ్డి, ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్‌ రమేష్‌, డాక్టర్‌ పుల్లారావు, డాక్టర్‌ ప్రదీప్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement