ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం

Jul 23 2026 1:42 AM | Updated on Jul 23 2026 1:42 AM

నల్లగొండ టౌన్‌ : ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని దానిని వెంటనే రద్దు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి డిమాండ్‌ చేశారు. 22 రోస్టర్‌ విధానాన్ని సవరించి, ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలని కోరుతూ బుధవారం మాల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వల్ల మాల విద్యార్థులు, నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, రోస్టర్‌ విధానాన్ని సవరించి 1 నుంచి 16 రోస్టర్‌ పాయింట్లలో మాలలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్ష అనంతరం నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ చైర్మన్‌ మందాల భాస్కర్‌, జిల్లా అధ్యక్షుడు నగేష్‌, రాజారావు, అనిల్‌, లింగమయ్య, బేరా బాలకిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement