న్యాయవాదుల హక్కుల కోసం పనిచేస్తా | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదుల హక్కుల కోసం పనిచేస్తా

Jul 23 2026 1:42 AM | Updated on Jul 23 2026 1:42 AM

రామగిరి(నల్లగొండ) : న్యాయవాదుల హక్కుల సాధనకు కృషి చేస్తానని తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు సామల రాంరెడ్డి స్పష్టం చేశారు. బార్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా ఎన్నికై న తర్వాత బుధవారం నల్లగొండ వచ్చిన ఆయనకు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అడ్వకేట్‌ ఆకవరపు సతీష్‌ కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సామల రాంరెడ్డి మాట్లాడుతూ తన ఎన్నికకు సహకారం అందించిన నల్లగొండ బార్‌ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. యువ న్యాయవాదులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, లీగల్‌ ఎడ్యుకేషన్‌ సెమినార్లు నిర్వహించడంతో పాటు, మహిళా న్యాయవాదుల వృత్తిపరమైన అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. కార్యక్రమంలో నల్లగొండ బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి బి.అశోక్‌కుమార్‌, ఉపాధ్యక్షులు స్వామిగౌడ్‌, నూకల సంధ్యారాణి, జాయింట్‌ సెక్రెటరీ అమరావతి, కార్యవర్గ సభ్యులు జనిగల రాములు, జి.కిషోర్‌, స్వామిదాస్‌, అక్కినపల్లి మురళీధర్‌రావు, రామచంద్రరావు, జవహర్‌లాల్‌, జి.మోహన్‌, వెంకట్రాంరెడ్డి, అనంతుల శంకరయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement