పీఆర్‌ఏఎన్‌తో న్యాయ సహాయం | - | Sakshi
Sakshi News home page

పీఆర్‌ఏఎన్‌తో న్యాయ సహాయం

Jul 22 2026 2:05 AM | Updated on Jul 22 2026 2:05 AM

రామగిరి (నల్లగొండ) : ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించడం, ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించడం, సామాజిక న్యాయ సాధనను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘ప్రాజెక్ట్‌ పబ్లిక్‌ రిడ్రెస్సల్‌ అసోసియేటెడ్‌ నెట్‌వర్క్‌’ (పీఆర్‌ఏఎన్‌) రూపొందించినట్లు నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వసంత్‌ తెలిపారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నల్లగొండ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ దాసరి అభిషిక్త మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌ దివ్యాంగులు, మహిళలు, చిన్నారుల హక్కులు, సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడం, ప్రాథమిక పరిశీలన, చట్టపరమైన సలహాలు ఇవ్వడం, జిల్లా న్యాయ సేవల సంస్థకు రిఫర్‌ చేయడం, కౌన్సెలింగ్‌, మధ్యవర్తిత్వం, సమస్య పరిష్కారమయ్యే వరకు ఫాలో అప్‌ సేవలను అందించడం ఈ ప్రాజెక్ట్‌ ప్రత్యేకత అన్నారు. ప్రజలకు ప్రాజెక్ట్‌ సేవలను నేరుగా చేరవేయడం, అవగాహన సదస్సులు నిర్వహించడం, ఫిర్యాదుల సమన్వయంలో భాగస్వామ్య బాధ్యతలు వహిస్తుందని చెప్పారు. న్యాయ సహాయం లేదా ఫిర్యాదుల పరిష్కారం కోసం అవసరమైన బాధితులు, ప్రజలు 93815 92181 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వసంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement