ఆపన్నులకు అండగా ‘కై ండ్‌నెస్‌ వాల్‌’ | - | Sakshi
Sakshi News home page

ఆపన్నులకు అండగా ‘కై ండ్‌నెస్‌ వాల్‌’

Jul 22 2026 2:05 AM | Updated on Jul 22 2026 2:05 AM

నల్లగొండ : ఒకరు ఇచ్చే చిన్న సహాయం మరొక కుటుంబానికి ఎంతో మేలు చేస్తుందని.. ఇటువంటి కార్యక్రమాలు యువతలో సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని అదనపు ఎస్పీ జి.రమేష్‌ అన్నారు. మంగళవారం నల్లగొండలో ‘నవయువ ఫౌండేషన్‌’ ఏర్పాటు చేసిన ‘కైండ్‌నెస్‌ వాల్‌’ (మానవత్వపు గోడ)ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతిఒక్కరూ తమ ఇళ్లలో పాత దుస్తులు, బొమ్మలు, పుస్తకాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను పారేయకుండా, అవసరమైన వారికి అందించే గొప్ప ఆలోచనతో ‘కైండ్‌నెస్‌ వాల్‌’ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం చిన్నారులకు పాత బొమ్మలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ కె.శివరాంరెడ్డి, పెట్రోల్‌ బంక్‌ ఇన్‌చార్జ్‌ బి.సంతోష్‌ (ఆర్‌ఐ), కె.నాగరాజు (ఆర్‌ఎస్‌ఐ), విజయ, ఫౌండేషన్‌ సభ్యులు కె.విష్ణువర్ధన్‌ రెడ్డి, ఎం.హరీష్‌, వి.మనీష్‌ కుమార్‌రెడ్డి, ఎం.గోపీనాథ్‌ రెడ్డి, పి.లక్ష్మీ ప్రసన్న, సంధ్య, బి.చందు, అమూల్య, వంశీ, హరినాథ్‌రెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement