రామగిరి(నల్లగొండ) : తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం (టీజీసీజీటీఏ) ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో యూనిట్ స్థాయి ఎన్నికలు బుధవారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అన్ని కళాశాలల యూనిట్ కార్యవర్గాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (అటానమస్) నల్లగొండ యూనిట్ ప్రెసిడెంట్‌గా ప్రొఫెసర్ టి.అరవింద, సెక్రటరీగా ఈ.రాంరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేవరకొండ ఎంకేఆర్ డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్‌గా డాక్టర్ ఎస్.రాజారామ్, హాలియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్‌గా డాక్టర్ ఎండీ.హసేన, సెక్రటరీగా డాక్టర్ జి.యాదగిరి, మిర్యాలగూడ కేఎన్‌ఎం డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్‌గా భీమార్జున్‌రెడ్డి, సెక్రటరీగా డాక్టర్ బి.రవీందర్‌ని ఎన్నుకున్నారు. నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్‌గా కె.ప్రవీణ్‌రెడ్డి, సెక్రటరీగా కె.హరిత, నల్లగొండ నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రెసిడెంట్‌గా కె.శివరాణి, సెక్రటరీగా ఎం.వెంకట్‌రెడ్డి, రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్‌గా డాక్టర్ ఎన్‌ఎల్.నీలిమ, సెక్రటరీగా డాక్టర్ రవీందర్‌రావును ఎన్నుకున్నారు.


