
రసాయన పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలి
నల్లగొండ: జిల్లా పరిధిలోని రసాయన, ఔషధ పరిశ్రమల్లో నెల రోజుల్లోగా తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, జిల్లా ఫైర్ ఆఫీసర్, జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారులతో గురువారం ఆమె కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రాంతంలో జూన్‌లో జరిగిన పెద్ద విస్పోటన ఘటనకు సంబంధించి భద్రతా సమస్యలపై తనిఖీలకు జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు సంబంధించి చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తనిఖీలు దశల వారీగా నిర్వహించబడతాయని పేర్కొన్నారు.
రెవెన్యూ అర్జీలను వేగంగా పరిష్కరించాలి
నల్లగొండ: భూభారతి అమలులో భాగంగా రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన అర్జీలను వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన నల్లగొండ ఆర్డీఓ కార్యాలయంలో నల్లగొండ డివిజన్‌లోని తహసీల్దార్లు, డీటీలు, ఆర్‌ఐలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. అర్జీల పరిష్కారంలో ఎలాంటి తప్పులకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు, డీటీలు, ఆర్‌ఐలు, సీనియర్ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.
మూసీకి 2,200 క్యూసెక్కుల వరద
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2,200 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్‌లో గురువారానికి 643.50 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు రెండు క్రస్ట్ గేట్లను రెండు అడుగుల మేర పైకెత్తి 2,580 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి వదులుతున్నారు. ఆయకట్టులో పంటల సాగకు కోసం ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వకు 620 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గేట్లు, కాల్వల ద్వారా మొత్తం 3,200 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుంది. మూసీ రిర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.07 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
బ్యూటీషియన్, టైలరింగ్‌లో శిక్షణ
నల్లగొండ: నల్లగొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం)లో ఈ నెల 18 నుంచి బ్యూటీషియన్, టైలరింగ్ కోర్సుల్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా మేనేజర్ ఎ.అనిత ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 08682 244416 నంబర్‌నుం సంప్రదించాలని ఆమె కోరారు.
ఆర్జిత సేవలు పునఃప్రారంభం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆర్జిత సేవలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. శ్రీస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు విశేష పర్వాలు జరిగిన నేపథ్యంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను అధికారులు రద్దు చేశారు. పవిత్రోత్సవాలు ముగిసిన అనంతరం ఆలయ అధికారులు గురువారం ఉదయం ఆర్జిత సేవలను పునఃప్రారంభించారు. శ్రీసుదర్శన హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో నిత్య కై ంకర్యాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా జరిపించారు.

రసాయన పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలి

రసాయన పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలి