
క్రీడలతో మానసికోల్లాసం
రామగిరి(నల్లగొండ) : క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు అన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు మేకల అభినవ్ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిరంతరం బిజీగా ఉండే న్యాయవాదులకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడా పోటీలను నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి సంపూర్ణ ఆనంద్, కార్యదర్శి మంద నగేష్, కోశాధికారి బరిగల నగేష్, జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్ డేలో వినతుల స్వీకరణ
నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డేలో ఎస్పీ శరత్‌చంద్రపవార్ 52 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఆయా ఫిర్యాదులకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్‌కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారించి బాధితులకు చట్ట పరంగా న్యాయం జరిగే విధంగా చూడాలని పోలీసులకు సూచించారు.
అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలి
చిట్యాల : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ బొల్లారం భిక్షపతి పేర్కొన్నారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్, మండల పరిషత్ పాఠశాలలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలోని ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు, టీచర్స్ డైరీలు,, విద్యార్థుల వర్క్‌బుక్స్‌ను పరిశీలించారు. పలువురు విద్యార్థులతో ఆయన మాట్లాడి గణితం, ఆంగ్లం, తెలుగు అంశాలపై ప్రశ్నించి సమాధానాలను రాబట్టారు. విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచాలని కోరారు. విద్యార్థులకు అర్థమయ్యే రితీలో పాఠ్యాంశాలను బోఽధించాలన్నారు.
మూసీకి కొనసాగుతున్న వరద
కేతేపల్లి : భారీ వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు సోమవారం ప్రాజెక్టు మూడు క్రస్ట్‌గేట్లను పైకెత్తి దిగువకు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం వరకు ఎగువ నుంచి మూసీకి 4,718 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. మూడు క్రస్ట్‌గేట్ల ద్వారా 4,375 క్యూసెక్కులు, మూసీ కుడి, ఎడమ కాల్వలకు 454 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 645 అడుగుల (4.46 టీఎంసీలు) గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్‌లో.. ప్రస్తుత నీటిమట్టం 643.50 అడుగుల (4.04 టీఎంసీలు) వద్ద ఉంది.

క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలతో మానసికోల్లాసం