
పాత పద్ధతిలోనే టెన్త్ పరీక్షలు
నల్లగొండ : పదో తరగతి వార్షిక పరీక్షలు పాత పద్ధతిలోనే జరగనున్నాయి. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మాదిరిగానే రాత పరీక్ష 80 మార్కులు, ఇంటర్నల్ మార్కులు 20 చొప్పున ఉంటాయి. ఈ విధానం 2014–15 నుంచి అమల్లో ఉంది. కాగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక శాతం విద్యార్థులకు 20కి 20 ఇంటర్నల్ మార్కులు వేస్తున్నాయని, దీంతో విద్యార్థులు నష్టపోతున్నారని విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కుల విధానం ఉండదని 100 మార్కులతోనే వార్షిక పరీక్షలు ఉంటాయని గత ఏడాది అక్టోబర్ 28 ప్రభుత్వం ప్రకటించింది.
ఉత్కంఠకు తెర
జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అయ్యా యి. మూడు నెలలు కావస్తున్నా వార్షిక పరీక్షలు 100 మార్కులతో నిర్వహించాలనే దానిపై అధికారిక ప్రకటన రాకపోవడంతో విద్యార్థులను ఆ దిశగా సిద్ధం చేయడంలో ఉపాధ్యాయుల్లో సందిగ్ధం నెలకొంది. దీంతో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకటన కోసం ఉపాధ్యాయులకు ఎదురుచూపులు తప్పలేదు. ఎట్టకేలకు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పాత పద్ధతిలోనే వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడంతో ఉత్కంఠకు తెరపడింది.
ఫ ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ డైరెక్టర్
ఫ ఉపాధ్యాయ వర్గాల్లో వీడిన ఉత్కంఠ
ఫ రాత పరీక్షకు 80, ఇంటర్నల్‌కు 20 మార్కులు