
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
రామగిరి(నల్లగొండ) : యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ సూచించారు. బుధవారం ఎన్జీ కళాశాల ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విభాగాలు, కళాశాల యాంటీ డ్రగ్స్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, కోకై న్ లాంటి డ్రగ్స్ ప్రమాదకరమన్నారు. మీ పరిసరాల్లో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా, మిమ్మల్ని డ్రగ్స్ తీసుకోవాలని ఒత్తిడి చేసినా పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ కళాశాలలో రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని.. వాటిని అరికట్టాలని పోలీసు శాఖను కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ శివరామ్‌రెడ్డి, సిఐ. రాఘవరావు, ఎస్‌ఐ వై.సైదులు, యాంటీ డ్రగ్స్ కమిటీ కన్వీనర్ సుధాకర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు బొజ్జ అనిల్‌కుమార్, ఏ.మల్లేశం, వెంకట్‌రెడ్డి, కోటయ్య, సావిత్రి, శివరాణి, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి