
స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధం చేయాలి
నల్లగొండ : స్వాతంత్య్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర వేడుకలపై బుధవారం ఆయన జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 15న ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్‌పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు.
నేడు వాలీబాల్ సెలక్షన్ పోటీలు
నల్లగొండ టూటౌన్ : అండర్ –15 వాలీబాల్ పోటీలకు బాలబాలికలను ఎంపిక చేసేందుకు గురువారం నల్లగొండలోని మేకల అభినవ్ ఔట్‌డోర్ స్టేడియంలో సెలక్షన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి దగ్గుపాటి విమల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెలక్షన్ పోటీల్లో ప్రతిభ కనభర్చిన వారిని ఈనెల 18, 19 తేదీల్లో హైదరాబాద్‌లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 9948987026 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
గవర్నర్‌ను కలిసిన ఎంజీయూ వీసీ
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ బుధవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. యూనివర్సిటీలోని పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు, విద్యాభివృద్ధి, కోర్సులు తదిరత అంశాలను గవర్నర్‌కు వివరించారు. సెప్టెంబర్ నెలలో యూనివర్సిటీలో నిర్వహించనున్న కాన్వకేషన్‌కు గవర్నర్‌ను ఆహ్వానించారు. ఆయన వెంట రిజిస్ట్రార్ అలువాల రవి, సీఓఈ డాక్టర్ ఉపేందర్‌రెడ్డి ఉన్నారు.
బోధనోపకరణాతో సృజనాత్మకత
కట్టంగూర్ : ఉపాధ్యాయులు బోధనోపకరణాల(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్)తో బోధిస్తే విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందుతుందని డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. బుధవారం కట్టంగూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండలస్థాయి బోధనోపకరణల మేళాను ఆయన పరిశీలించి మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా బోధనలో మార్పులు రావాలన్నారు. ఈ మేళాలో విద్యార్థులు మోడల్ చార్ట్స్, శాసీ్త్రయ పరికరాలు, గణిత ఉపకరణాలు, భూగోళశాస్త్ర పరికరాలు, భాషా అభ్యసన సాధనాలను ప్రదర్శించారు. ఉత్తమ ప్రదర్శనలు చేసిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెమెంటోలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్‌రావు, ఎంఈఓ అంబటి అంజయ్య, ఉపాధ్యాయులు ఉన్నారు.
నీటి పారుదల ఎస్‌ఈకి.. సీఈగా పదోన్నతి
నల్లగొండ : నీటిపారుదల శాఖలో ఎస్‌ఈగా పనిచేస్తున్న అజయ్‌కుమార్‌కు సీఈగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఎస్‌ఈగా ఎవరికీ బాధ్యతలను అప్పగించలేదు. పదోన్నతి పొందిన అజయ్‌కుమార్‌ను బుధవారం టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ నాగిళ్ల మురళి, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి శేఖర్‌రెడ్డి, డిఐ.రాజు, మేడి జయరావు, మధుసూదనాచారి, కత్తుల మనోజ్‌ప్రదీప్, మహేష్, లక్ష్మయ్య, సైదులు, శ్రీనివాస్, యూనస్, రాజరత్నం పాల్గొన్నారు.

స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధం చేయాలి

స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధం చేయాలి