
పదేళ్లలో బీఆర్‌ఎస్ చేసిందేమిటి..?
నల్లగొండ : పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన గుంటకండ్ల జగదీష్‌రెడ్డి.. 80 ఎకరాల్లో ఫామ్‌హౌస్ సంపాదించకున్నాడు తప్ప జిల్లా అభివృద్ధికి చేసింది ఏమీ లేదని ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ విమర్శించారు. జిల్లా ప్రాజెక్టులను బీఆర్‌ఎస్ హయాంలో పూర్తి చేయాల్సింది. అప్పుడు గాలికి వదిలేశారు. నిండుకుండలా ఉన్న పానగల్ ఉదయ సముద్రం వద్దకు వెళ్లి నీరు లేదని మాట్లాడుతున్నావు .. కళ్లున్నాయా.. లేవా.. అని మండిపడ్డారు. బుధవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్‌నాయక్ మాట్లాడారు. వర్షాలు పడతున్నాయి.. చెరువులు, కుంటలకు నీరు చేరుతుంది. ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే ఊరుకోరన్నారు. కేసీఆర్‌కు, కేటిఆర్‌కు ఊడిగం చేశాడు తప్ప జగదీష్‌రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చేసింది ఏమీలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పడు ఎస్‌ఎల్‌బీసీని చేపట్టి 30 కిలోమీటర్లకు పైగా పూర్తి చేస్తే.. ఆ తరువాత వచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని విమర్శించారు. పదేళ్ళలో మిగిలిన 10 కిలో మీటర్ల సొరంగం తీసి ఉంటే నేడు గ్రావిటీ ద్వారానే జిల్లాకు నీరు అందేదన్నారు. మీ పాపం, చేతగాని తనం వల్ల జిల్లా ప్రజలకు నష్టం జరిగిందని విమర్శించారు. రూ.90 కోట్లు విడుదల చేస్తే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తయి లక్ష ఎకరాలకు నీరు అందేదని, కానీ కోమటిరెడ్డికి పేరు వస్తుందన్న కారణంగా పట్టించుకోలేదన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జగదీష్‌రెడ్డి భూదందాలు, ఇసుక దందాలు, కంకర దందాలు చేశాడని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు వంగూరి లక్ష్మయ్య పాల్గొన్నారు.
వర్షం నీరు సముద్రంలో కలుస్తుందని విమర్శించడం సిగ్గుచేటు
ఎమ్మెల్సీ శంకర్‌నాయక్