
సంఘటితమై దేశ ఐక్యతను చాటుదాం
నల్లగొండ టూటౌన్ : ప్రజలంతా సంఘటితమై దేశ ఐక్యతను చాటుదామని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల నుంచి ప్రకాశం బజారు మీదుగా పెద్ద గడియారం సెంటర్ వరకు తిరంగయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే బాలరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ యే శ్రీరామ రక్ష అన్నారు. భారతీయులంతా జాతీయ జెండాను ముద్దాడి ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు గోలి మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్‌గౌడ్, వీరెళ్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజుయాదవ్, పల్లెబోయిన శ్యాంసుందర్, దాయం భూపాల్‌రెడ్డి, బొజ్జ నాగరాజు, కంకణాల నాగిరెడ్డి, పోతెపాక లింగస్వామి, పాలకూరి రవి, నీరజ తదితరులు పాల్గొన్నారు.