
గౌరికుంటతండా జలమయం
కొండమల్లేపల్లి : భారీ వర్షానికి నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని గౌరికుంటతండా జలమయం అయ్యింది. భారీ వర్షం వల్ల తండా పైనున్న అబ్బనబోయినగూడెం నుంచి వచ్చిన వరద అంత తండాను ముంచెత్తింది. సుమారు 15 మంది ఇళ్లలోకి నీరు చేరింది. అబ్బనబోయిన గూడెం సమీపంలో నిర్మించిన ఓ ఫంక్షన్ హాల్ ఎత్తు పెంచుకొని వరద కట్టపోయడంతో పట్టణంలోని నల్లకుంటకు వెళ్లాల్సిన వర్షపు నీరు మొత్తం కూడా తండాకు చేరింది. ఈ విషయాన్ని గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. వెంటనే అధికారులు గ్రామాన్ని సందర్శించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి తండావాసులకు హామీ ఇచ్చారు. ఆయన వెంట తహసీల్దార్ నరేందర్, ఎస్‌ఐ అజ్మీర రమేష్, రెవెన్యూ సిబ్బంది తదితరులున్నారు.

గౌరికుంటతండా జలమయం

గౌరికుంటతండా జలమయం