
అదనపు చార్జీలపై ఆగ్రహం
రామగిరి(నల్లగొండ) : రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీ అదనపు బస్సులను ఏర్పాటు చేసింది. అయితే బస్సుల్లో చార్జీలను పెండంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ నుంచి హైదరాబాద్ సాధారణ టికెట్ ధర రూ.210 ఉంటే.. ప్రత్యేక బస్సులో రూ.280 వసూలు చేశారు. కాగా.. నల్లగొండ బస్టాండ్ సోమవారం ప్రయాణికులతో రద్దీగా మారింది. సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు బస్ చార్జీలు అధికంగా ఉండడంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
రద్దీగా మారిన బస్టాండ్..
మూడు రోజులు సెలవులు ముగియడంతో ప్రయాణికులు సొంతూళ్ల నుంచి ఆయా ప్రాంతాలకు బయల్దేరారు. దీంతో నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్ సోమవారం కిక్కిరిసిపోయింది. బస్సుల కోసం ప్రయాణికులు బారులు తీరారు. బస్సు ప్లాట్‌ఫాం మీదకు వచ్చే సమయంలోనే బుస్సులోకి ఎక్కేందుకు ప్రయత్నించారు. ఇక బస్సులు ఎక్కే సమయంలో తొక్కిసలాట సైతం జరిగింది. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని.. ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫ ఆర్టీసీ సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం

అదనపు చార్జీలపై ఆగ్రహం