
స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి
నల్లగొండ: ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. స్వాతంత్య్ర వేడుకల నిర్వహణపై గురువారం నల్లగొండ కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు త్వరితగతిన చేయాలన్నారు. ముఖ్య అతిథి సందేశానికి శాఖల వారి ప్రగతికి సంబంధించిన నివేదికలను ముఖ్య ప్రణాళిక అధికారికి అందజేయాలని సూచించారు. ఈ నెల 15న ఉదయం 9 గంటలకు పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా జాతీయ పతాకావిష్కరణ, వందన స్వీకరణ, సందేశం, శకటాలు, స్టాళ్ల ప్రదర్శన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించే విధంగా పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. వివిధ శాఖల ద్వారా లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ చేయాలని చెప్పారు. వేడుకలకు హాజరయ్యే వారందరికీ అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, ఇన్‌చార్జి డీఆర్‌ఓ వై.అశోక్‌రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి