Telangana Crime News: బైక్‌కు నిప్పు.. తాగిన మైకమా లేదా కక్ష సాధింపా?
Sakshi News home page

బైక్‌కు నిప్పు.. తాగిన మైకమా లేదా కక్ష సాధింపా?

Published Wed, Jan 17 2024 2:02 AM

- - Sakshi

పాలకవీడు: మండలంలోని సజ్జాపురం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు సోమవారం రాత్రి గ్రామ శివారులో మద్యం సేవించి గొడవపడ్డారని.. ఈ క్రమంలో ఓ బైక్‌ను తగలబెట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ లింగంను వివరణ కోరగా.. సజ్జాపురం గ్రామానికి చెందిన మూగల బాలసైదులు మరో వ్యక్తితో కలిసి సోమవారం రాత్రి బైక్‌పై వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వారిని అడ్డుకుని వారి బైక్‌ను తగలబెట్టినట్లు తెలిపారు.

మూగల బాలసైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం మద్యం మత్తులో జరిగిన గొడవకారణంగానే బైక్‌కు నిప్పు పెట్టారా.. లేదా వ్యక్తిగత కక్షతో ఈ ఘటన చోటుచేసుకుందా అనే విషయం తెలియనుంది.

Advertisement
 
Advertisement