ఎంజీయూలో ‘సాక్షి’ నిర్వహించిన పీపుల్స్ ఎజెండాలో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని పలువురు విద్యార్థులు కోరారు.
- 10లో
మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించని కాంగ్రెస్
కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు కుదరకపోవడంతో మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అక్కడ బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి కూడా టికెట్ కావాలని దరఖాస్తు చేసుకున్నారు. పొత్తుల నేపథ్యంలో ఇన్ని రోజులు ఆ స్థానాన్ని పక్కన పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ ఇద్దరిలో ఎవరికి ఆ స్థానాన్ని కేటాయిస్తుందన్నది తేలాల్సి ఉంది. సూర్యాపేట, తుంగతుర్తి నియోజక వర్గాల్లోనూ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సూర్యాపేటలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. తుంగతుర్తిలోనూ టికెట్ ఆశిస్తున్న అద్దంకి దయాకర్, మోత్కుపల్లి నర్సింహులులో ఎవరికి కేటాయిస్తుందన్నది తేలాల్సి ఉంది.