ఓట్లు అక్కడ! | - | Sakshi
Sakshi News home page

ఓట్లు అక్కడ!

Jan 6 2026 7:18 AM | Updated on Jan 6 2026 7:18 AM

ఓట్లు

ఓట్లు అక్కడ!

రాజకీయ పార్టీలతో సమావేశంలోనూ అదే చర్చ

మేము ఇక్కడ..
మున్సిపాలిటీల్లో ఎందుకిలా?

తప్పుల తడకగా ముసాయిదా ఓటరు జాబితా

ఒక వార్డులో నివాసం ఉంటే.. మరో వార్డులో ఓట్లు

ఒకే కుటుంబంలోని ఓట్లు వేర్వేరు వార్డుల్లోకి..

సరిచేయాలంటూ వెల్లువెత్తిన ఫిర్యాదులు

తప్పుల తడకగా మున్సిపల్‌ ఓటర్ల జాబితా రూపొందించారంటూ రాజకీయ పార్టీల నేతలు ఆరోపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీల నేతలతో ముసాయిదా ఓటరు జాబితాపై సోమవారం మున్సిపల్‌ కమిషనర్లు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఒక వార్డులో ఓట్లు మరో వార్డులోకి వెళ్లాయని వాటిని సరి చేయాలంటూ కమిషనర్ల దృష్టికి తీసుకురాగా వార్డు హద్దుల ప్రకారం ఉంటే సరి చేస్తామని హామీ ఇచ్చారు.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్‌ ఎన్నికల కోసం విడుదల చేసిన ఓటరు ముసాయిదా జాబితా తప్పుల తడకగా మారింది. ఒక వార్డులో నివాసం ఉంటే మరో వార్డులోకి ఓట్లు మారిపోయాయి. ఒకే ఇంట్లోని వ్యక్తుల ఓట్లు వేర్వేరు వార్డుల్లోకి వెళ్లిపోయాయి. పలుచోట్ల ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, వాటిని సరి చేయాలంటూ కమిషనర్లకు భారీగా ఫిర్యాదులు వచ్చాయి.

18 మున్సిపాలిటీలు.. 1556 ఫిర్యాలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటిలో నకిరేకల్‌ మున్సిపాలిటీ పాలకవర్గం గడువు ఇంకా ముగియలేదు. దీంతో నికిరేకల్‌ మినహా.. మిగతా 18 మున్సిపాలిటీల్లో ఈ నెల 1వ తేదీన వార్డుల వారీగా ఓటరు జాబితాను ప్రచురించారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై అధికారులు అభ్యంతరాల స్వీకరణ చేపట్టారు. దీంతో ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేశారు. ఒక వార్డులో ఓటర్లను, మరో వార్డులో చూపించడంతో కొందరి పేర్లు తప్పుగా దొర్లడం, మరికొందరి ఓట్లే కనిపించకుండా పోవడంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందజేశారు. సోమవారం సాయంత్రం వరకు 1,556 ఫిర్యాదులు మున్సిపల్‌ కమిషనర్లకు అందాయి.

చిట్యాల మున్సిపాలిటీలో అత్యధికం

ఉమ్మడి జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటీలో అత్యధికంగా అభ్యంతరాలు వచ్చాయి. ఆ మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల జాబితాలో దొర్లిన తప్పులపై 258 ఫిర్యాదులు అందాయి. ఆ తరువాత అత్యధికంగా సూర్యాపేట మున్సిపాలిటీలో 238 ఫిర్యాదులు వచ్చాయి. వాటితోపాటు అన్ని మున్సిపాలిటీల్లోనూ తమ వార్డులు మారిపోయాయని, తాము ఒక చోట ఉంటే మరొక వార్డులో ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. ఇక తక్కువగా అభ్యంతరాలు మోత్కూర్‌ మున్సిపాలిటీలో (రెండే) వచ్చాయి. పలు చోట్ల ఓట్లు గల్లంతైనా వాటిపై అధికారులు ఫిర్యాదులు తీసుకోవడం లేదని ఓటర్లు వాపోయారు.

ఓట్లు అక్కడ!1
1/1

ఓట్లు అక్కడ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement