నా భూమిని ఆక్రమించారు
గ్రామంలో సర్వే నెంబర్ 257లో 10 గుంటల భూమి ఉంది. గ్రామానికి చెందిన మెగావత్ రాయమల్లు నా భూమిని ఆక్రమించుకుని నన్ను బెదిరిస్తున్నాడు. నాకు పక్షవాతం వచ్చి నడవలేకపోతున్నాను. గతంలో అధికారులను కలిసినా నాకు న్యాయం జరగలేదు. నా భూమి నాకు ఇప్పించాలి.
– ఖాజా, పంగవానికుంట, అనుముల మండలం
నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల్లో పని చేస్తున్నాం. మాకు ఏడు నెలల నుంచి జీతాలు రాలేదు. ఈ విషయమై అడిగితే కళాశాల ప్రిన్సిపాల్‌ను మాకు సంబంధం లేదని చెబుతున్నారు. ఏజెన్సీ వారు రేపు, మాపు అంటూ ఏడు నెలలుగా జరుపుతున్నారు. కుటుంబం గడవడం ఇబ్బందిగా ఉంది. జీతాలు ఇప్పించాలి.
– శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది,
మెడికల్ కళాశాల, నల్లగొండ
నా భూమిని ఆక్రమించారు


