అక్రమ పట్టా రద్దు చేయాలి..
నాకు నలుగురు కుమార్తెలు. నా పేరున ఉన్న 7 ఎకరాల 18 కుంటల భూమిని నాకు తెలియకుండానే పెద్ద కూతురు మోదుగు విజయ 3.32 ఎకరాలు, 4వ కూతురు యాట జయలక్ష్మి 3.22 ఎకరాలు అక్రమంగా పట్టా చేయించుకున్నారు. ఆ పట్టాను రద్దు చేయాలని గతంలో ఆర్డీఓకు విన్నవించాం. ఏడు నెలలు గడిచింది. అయినా సమస్యలు పరిష్కారం కాలేదు. మీరే న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరింది. స్పందించిన కలెక్టర్ ఆ పట్టాను బ్లాక్‌లో పెట్టి ఫైల్ పుటప్ చేయాలని ఆర్డీఓను ఆదేశించారు.
– సుశీలమ్మ, పెర్కకొండారం,
శాలిగౌరారం మండలం
నాకు ముగ్గురు ఆడ పిల్లలు. నా భర్త రాజశేఖర్ ఇటీవల చనిపోయాడు. ఆయన పేరున, మా అత్తగారి పేరున భూమి ఉంది. నా భర్త చనిపోవడంతో మా అత్త, ఆడపడుచులు నన్ను వారింటికి రావద్దని వెళ్లగొట్టారు. ముగ్గురు ఆడ పిల్లల్లో ఓ పాపకు 7 నెలలు. భూమి ఇవ్వకుండా.. ఇంటిని రానివ్వకపోతే నేను ఎలా బతకాలి. ఈ విషయంలో నాకు న్యాయం చేయాలి.
– గాదరి శృతి, బాలింత,
బొడంగిపర్తి, చండూరు మండలం
అక్రమ పట్టా రద్దు చేయాలి..


