రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన
నల్లగొండ : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా నల్లగొండలోని పోప్‌పాల్ పాఠశాలలో విద్యార్థులకు సోమవారం రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రమేష్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న వయసు నుంచే ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకుని పాటిస్తే భవిష్యత్‌లో ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ వినియోగించాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ సైదులు, రిటైర్డ్ సీఐ అంజయ్య, ప్రిన్సిపాల్ రవి, ఉపాధ్యాయులు, ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులు పాల్గొన్నారు.


