ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, సెంట్రల్ లైటింగ్ సిస్టం, ఎస్టీపీలను ప్రారంభించడంతో పాటు ఏటీసీ సెంటర్‌కు భూమిపూజ చేయాల్సి ఉండగా.. ఆయన ఆదేశాల మేరకు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ వాటిని ప్రారంభించారు. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వగ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఇప్పటి వరకు దాదాపు రూ.200 కోట్ల నిధులను మంజూరు చేశారు. ముఖ్యమంత్రి ఇంటి నుంచి జమ్మిచెట్టు వరకు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో గ్రామ పంచాయతీ, బస్‌షెల్టర్, సోలార్ సెంట్రల్ లైటింగ్ సిస్టం, మిల్క్ చిల్లింగ్ సెంటర్, నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల, నాలుగు లెన్ల రహదారిని చూసి మురిసిపోయారు.


