ఒంటికాలిపై నిలబడి ఉద్యోగుల నిరసన | - | Sakshi
Sakshi News home page

ఒంటికాలిపై నిలబడి ఉద్యోగుల నిరసన

Oct 23 2026 1:09 AM | Updated on Oct 23 2026 1:09 AM

కందనూలు: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం పదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ వద్ద ఏర్పాటుచేసిన సమ్మె శిబిరంలో ఉద్యోగులు ఒంటి కాలిపై నిలబడి నిరస న తెలిపారు. అనంతరం జేఏసీ జిల్లా అధ్యక్షుడు డా.బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి కుమార్‌ మాట్లాడుతూ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం పది రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, ఈహెచ్‌ఎస్‌ అమలు చేయాల ని కోరారు. కార్యక్రమంలో జేఏసీ గౌరవాధ్యక్షు డు శ్రీనివాసులు, కోశాధికారి ప్రవీణ్‌, జేఏసీ ప్రతినిధులు డా.జగన్‌, డా.మహతి, డా.సాయి కంఠ, రజియా, సురేష్‌, వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు.

325వ రోజుకు చేరిన దీక్షలు

చారకొండ: గోకారం జలాశయం నిర్మాణంలో ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాలను ముంపు నుంచి మినహాయించాలని చేపట్టిన రీలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 325వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా డిండి ఎత్తిపోతలను రద్దు చేయాలని, ఎర్రవల్లి ,ఎర్రవల్లి తండా నిర్వాసితుల గోడు పట్టదా అని ఫ్లకార్డు ప్రదర్శించి.. తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఇప్పటికై నా తమ గ్రామాలను ముంపు ముప్పు నుంచి మినహాయించాలని కోరారు. కాగా, ఎర్రవల్లిలో చేపట్టిన దీక్ష శిబిరంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన సమితి ఆద్వర్యంలో డీఎల్‌ఐని రద్దు చేయాలని సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల నిర్వాసితులు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

24న ఉమ్మడి జిల్లా

క్రికెట్‌ ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఈనెల 24వ తేదీన స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–19 విభాగం బాలబాలికల ఉమ్మడి జిల్లాస్థాయి క్రికెట్‌ ఎంపికలు జరుగుతాయని అండర్‌–19 ఉమ్మడి జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఆధార్‌కార్డు, బోనఫైడ్‌, ఎస్‌ఎస్‌సీ మెమోతో ఆ రోజు ఉదయం 10 గంటలకు మినీ స్టేడియంకు చేరుకోవాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement