పకడ్బందీగా రెండో దశ జనగణన | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా రెండో దశ జనగణన

Oct 23 2026 1:09 AM | Updated on Oct 23 2026 1:09 AM

కందనూలు: జిల్లాలో రెండో దశ జనగణన పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది ప్రభుత్వ నిర్దేశిత విధి విధానాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ సూచించారు. జనగణన రెండో దశపై ఆర్డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, జనగణన చార్జ్‌ అధికారులు, సహాయ చార్జ్‌ అధికారులకు అవగాహన కల్పించేందుకు గురువారం కలెక్టరేట్‌లోని ప్రధాన హాల్‌లో ఏర్పాటుచేసిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని అచ్చంపేట సబ్‌ కలెక్టర్‌ సలోని ఛాబ్రా, అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయంతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. జనగణన అత్యంత ప్రాధాన్యమైన ప్రభుత్వ కార్యక్రమమన్నారు. ఈ ప్రక్రియలో సేకరించే సమాచారం ప్రామాణికంగా ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సమాచార సేకరణ, నమోదు తదితర ప్రక్రియల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా, ప్రతి వివరాన్ని జాగ్రత్తగా పరిశీలించి నమోదు చేయాలని ఆదేశించారు. శిక్షణలో వివరించే అంశాలను పూర్తిస్థాయిలో అవగాహన చేసుకుని, క్షేత్రస్థాయిలో వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని తెలిపారు. విధి నిర్వహణలో ఎదురయ్యే సందేహాలను శిక్షణ సమయంలోనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం రెండో దశలో చేపట్టాల్సిన విధులు, బాధ్యతలు, అనుసరించాల్సిన కార్యాచరణపై శిక్షకులు శివరామకృష్ణ, రిషిత్‌రెడ్డి శిక్షణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement