భూగర్భ జల‘సిరి’! | - | Sakshi
Sakshi News home page

భూగర్భ జల‘సిరి’!

Oct 23 2026 1:09 AM | Updated on Oct 23 2026 1:09 AM

రైతులకు ప్రయోజనం..

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జలసిరి కార్యక్రమం ద్వారా ప్రతి రైతు తన వ్యవసాయ పొలంలో నీటి గుంతలు తవ్వించే అవకాశం లభించింది. తద్వారా పంట పొలాలలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అర్హత కలిగిన ప్రతి రైతు పొలాల్లో నీటి కుంటలు, బోర్‌వెల్‌ రీచార్జి తదితర పనులను సద్వినియోగం చేసుకోవాలి.

– చిన్న ఓబులేషు, డీఆర్డీఓ

కందనూలు: ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు లేక చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. రోజురోజుకూ భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నీటి వనరుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగా వీబీ–జీ రామ్‌జీ పథకం ద్వారా జలసిరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గ్రామాల్లో నీటి వనరుల అభివృద్ధి, చెరువుల పునరుద్ధరణ, ఇంకుడు గుంతల నిర్మాణం, వర్షపునీటి నిల్వ వంటి పనులను ముమ్మరం చేశారు. తద్వారా గ్రామీణ కూలీలకు ఉపాధి లభించడంతో పాటు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు.

చేపడుతున్న పనులు ఇవే..

జిల్లాలో వాన నీటిని సద్వినియోగం చేసుకొని భూగర్భజలాలు పెంచడం కోసం వివిధ రకా ల పనులను చేపడుతున్నారు. ఉపాధి కూ లీలు, లబ్ధిదారులకు ధర గిట్టుబాటు అయ్యేలా పనుల రేట్లను పెంచారు. ఇంకుడు గుంతకు రూ. 6,600, బోర్‌వెల్‌ రీచార్జీకి రూ. 36వేలు, సామూహిక ఇంకుడు గుంతకు రూ. 13,500, ఫారం పాండ్‌కు (5 రకాలు) రూ. 2లక్షల చొప్పున వీబీ–జీ రామ్‌జీ పథకంలో నిధులు వెచ్చిస్తున్నారు.

మొత్తం

కూలీలు :

3.67లక్షలు

యాక్టివ్‌

జాబ్‌కార్డులు :

98వేలు

ప్రస్తుతం పనిచేస్తున్న వారు :

8,200

యాక్టివ్‌

కూలీలు :

1.59లక్షలు

జిల్లాలో మొత్తం

జాబ్‌కార్డులు : 1.92లక్షలు

కల్వకుర్తి పట్టణంలో గురువారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే మహిళలు, యువతులు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి.. సాయంత్రం కై లాస గుట్టపైకి పలు కాలనీల నుంచి ఊరేగింపుగా చేరుకొని ఆడి పాడారు. బతుకమ్మ సంబురాలతో పూలసింగిడిని తలపించింది. – కల్వకుర్తి రూరల్‌

– వివరాలు IIIలో..

వీబీ–జీ రామ్‌జీ పథకంలో నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం

భూగర్భజలాలు పెంపొందించేలా కార్యాచరణ

రైతులకు చేకూరనున్న ప్రయోజనం

ఇవీ ప్రయోజనాలు..

వ్యవసాయ పొలాల్లో ఫారం పాండ్స్‌ (నీటి కుంటలు) ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా వర్షపు నీటిని నిల్వ చేసి, వ్యవసాయ అవసరాలకు వినియోగించవచ్చు. అలాగే గ్రామ పరిసరాల్లో పెర్కోలేషన్‌ ట్యాంక్‌లు నిర్మిస్తున్నారు. దీంతో భూగర్భజలాలు వృద్ధి అవుతాయి. ఇళ్లలో వినియోగించిన నీటిని, వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి, భూగర్బ జలాలు పెరిగేందుకు ఇంకుడు గుంతలు ఉపయోగపడతాయి. వీటి నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బోర్‌వెల్‌ల చుట్టూ గుంతలు తీసి, నిర్మాణం చేయడం వల్ల వర్షపు నీరు బోర్‌వెల్‌ లోపలికి వెళ్లి రీచార్జి చేస్తుంది. ఓపెన్‌ వెల్‌ చుట్టూ నిర్మాణం చేయడం వల్ల భూగర్భజలమట్టం పెరుగుతుంది. ఇలా నీటి సంరక్షణ పనులతో సాగు, తాగునీటి కొరతను అధిగమించవచ్చు.

కూలీలకు స్థానికంగానే ఉపాధి..

వీబీ–జీ రామ్‌జీ పథకంతో జలసిరి పనులను అనుసంధానం చేయడంతో గ్రామీణ కూలీలకు స్థానికంగానే ఉపాధి లభిస్తోంది. అదే సమయంలో గ్రామాల్లో నీటి వనరులు అభివృద్ధి చెందుతున్నాయి. అయితే అధికారులు గ్రామాల వారీగా నీటి అవసరాలను గుర్తించి, ప్రాధాన్యత ఆధారంగా పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. జలసిరి పనులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ఫలితాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. చేపట్టిన పనుల నాణ్యతను పర్యవేక్షించడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని అంచనా వేయడం, కూలీలకు సకాలంలో వేతనాలు అందించడం వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించాలి. ప్రజల భాగస్వామ్యంతో జలసిరి పనులను సమర్థవంతంగా అమలుచేస్తే, నీటి సంరక్షణతో పాటు గ్రామీణాభివృద్ధికి బాటలు వేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement