సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలి

Oct 23 2026 1:09 AM | Updated on Oct 23 2026 1:09 AM

కల్వకుర్తి రూరల్‌: ఉమ్మడి పాలమూరు ప్రాంత అభివృద్ధికి సాగునీటి ప్రాజెక్టులు ఎంతో కీలకమని.. పెండింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు పాలమూరుకు నష్టం కలిగించే డిండి ప్రాజెక్టును రద్దు చేయాలని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం పండుగ సాయన్న జయంతి సందర్భంగా కల్వకుర్తిలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పాలమూరు రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారని.. ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు పెండింగ్‌ ప్రాజెక్టులను యుద్దప్రాతిపదికన పూర్తిచేసి, జిల్లాకు దక్కాల్సిన నీటి వాటాను అందించాలని డిమాండ్‌ చేశారు. డిండి ఎత్తిపోతలతో ప్రభావితమయ్యే గ్రామాల ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కానుగుల జంగయ్య, వీరస్వామి మాదిగ, పెద్దయ్యగౌడ్‌, చీమర్ల అర్జున్‌రెడ్డి, రాజు, రుక్నొద్దీన్‌, పర్వతాలగౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement