సొంతూరిలో సీఎంకు నిరసన సెగ | - | Sakshi
Sakshi News home page

సొంతూరిలో సీఎంకు నిరసన సెగ

Oct 22 2026 1:03 AM | Updated on Oct 22 2026 1:03 AM

● డిండి ప్రాజెక్టు రద్దు చేయాలని ఫ్లకార్డు ప్రదర్శన

నాగర్‌కర్నూల్‌: దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి డిండి ప్రాజెక్టుపై నిరసన సెగ తగిలింది. గ్రామంలోని హనుమాన్‌ ఆలయానికి సీఎం వెళ్తుండగా.. వంగూరు మండలం పొల్కంపల్లికి చెందిన చీమర్ల అర్జున్‌రెడ్డి ఫ్లకార్డు ప్రదర్శిస్తూ.. డిండి ప్రాజెక్టును రద్దు చేయాలని, గోకారం రిజర్వాయర్‌లో ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాలు ముంపు లేకుండా చూడాలని, ఉమ్మడి జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేయాలని గట్టిగా నినాదాలు చేశారు. సీఎం ఎదురుగానే ఫ్లకార్డును ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఘటనతో పోలీసులు కంగుతిన్నారు. వెంటనే అర్జున్‌రెడ్డి వద్ద ఫ్లకార్డు లాక్కొని, అతడిని పక్కకు లాగేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిండి ప్రాజెక్టుతో పాలమూరు ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఆ ప్రాజెక్టును రద్దు చేయడంతో పాటు ఉమ్మడి పాలమూరులోని పెండింగ్‌ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు తమ పోరాటం ఆగదని పేర్కొన్నారు. కాగా, డిండి ప్రాజెక్టును రద్దు చేయాలని స్వంత ప్రాంతం నుంచే నిరసన వ్యక్తం కావడం.. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు ఏదుల రిజర్వాయర్‌ నుంచి కాకుండా కృష్ణానది నుంచి నేరుగా డిండి ప్రాజెక్టుకు నీరు తీసుకుపోవాలని లోలోపల ఒత్తిడి తీసుకొస్తున్న అంశానికి ఈ నిరసన తోడైందని చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement