పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం

Oct 22 2026 1:03 AM | Updated on Oct 22 2026 1:03 AM

కందనూలు: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు ఎనలేనివని ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ అన్నారు. బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు పరేడ్‌ మైదానంలోని స్థూపానికి అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో ఎందరో పోలీసులు అమరులయ్యారని గుర్తుచేశారు. 1993 నవంబర్‌ 14న సోమశిలలో జరిగిన దుర్ఘటనలో విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. అలాగే వారి కుటుంబాలకు పోలీసుశాఖ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. విపత్తులు, పండుగలు, ఎన్నికలు వంటి అన్ని సందర్భాల్లో పోలీసులు ముందుండి సేవలందిస్తున్నారని.. వారి త్యాగాలు అమూల్యమైనవని అన్నారు. దేశాభివృద్ధికి శాంతి, స్థిరత్వం, సామాజిక సమైక్యత అవసరమని.. పోలీసు వ్యవస్థను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తోందన్నారు. అంతకుముందు ఎస్పీ, ఏఎస్పీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరులకు సాయుధ దళాలు సంప్రదాయ స్మృతి పరేడ్‌ నిర్వహించారు. అనంతరం పోలీసు పరేడ్‌ నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు బుర్రి శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, సీఐ ఆశోక్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అమరుల స్థూపానికి నివాళులర్పిస్తున్న

కుటుంబ సభ్యుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement