ఈసారి వర్షాభావం వల్ల చెరువుల్లో నీరు లేకపోవడంతో చేపపిల్లలు తక్కువగా విడుదల చేస్తున్నారు. దీంతో చేపల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. ఆ ప్రభావం మత్స్యకారుల జీవనోపాధిపై పడుతుంది. చేపల ఉత్పత్తి పెరిగితే మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా లాభపడుతాయి. చెరువులోకి నీరు రాకపోవడంతో చాలా నష్టం. త్వరలో జిల్లాలోని చెరువుల్లో చేపపిల్లలు వదులుతారు.
– ఆంజనేయులు,
మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు
చేపల ఉత్పత్తి తగ్గితే మత్స్యకారుల కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రభుత్వమే మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలి. గతేడాది చేపల పెంపకంతో ఉపాధి దొరికింది. ఈసారి వర్షాలు లేక చెరువుల్లోకి నీరు రాకపోవడంతో చేపపిల్లలను తక్కువగా వదులుతున్నారు. చాలా చెరువుల్లో చేపల పెంపకమే ఆగిపోతుంది. మా వృత్తిపై ప్రభావం ఉండటంతోపాటు ఆర్థికంగా నష్టం నష్టపోతాం. – వెంకటస్వామి,
మత్స్యకార్మికుడు, కొల్లాపూర్
జిల్లాలో చేపపిల్లల పెంపకానికి అనుకూలంగా ఉన్న చెరువులను 284 గుర్తించాం. వాటిలో వారం రోజుల్లోగా పెద్ద, చిన్న చేపపిల్లలు వదులుతాం. వర్షాభావ పరిస్థితులతో నీరు రాకపోవడంతో తక్కువ చెరువుల్లో చేపపిల్లలు విడుదల చేస్తున్నాం. జిల్లాలోని చెరువుల్లో పెంచే చేపపిల్లలు బొత్స, రవ్వ, బంగారు తీగ, మిరుగల రకాలు ఉన్నాయి. – నర్సింహారావు,
జిల్లా మత్స్యశాఖ అధికారి
●


