మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు.. నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్‌లో విద్య.. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌కు శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎంపిక చేసిన వాటిని పబ్లిక్ స్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేయనుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. తొలిదశలో 8 నియోజకవర్గాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం రూ.87 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేస్తూ జీఓ నంబర్ 164ను విడుదల చేసింది.
నియోజకవర్గానికి ఒకటి చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
పాఠశాలల వారీగా విడుదలైన నిధుల వివరాలు (రూ.కోట్లలో)
ఉమ్మడి జిల్లాలో 8 పాఠశాలలకు రూ.87 కోట్ల నిధులు
నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్‌లో విద్య
తరగతి గదులు, ల్యాబ్స్, గ్రౌండ్, మరుగుదొడ్లతో ఆధునిక వసతులు


