కందనూలు: జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ హేమంత కేశవ్‌పాటీల్ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సర్ ప్రక్రియపై సమీక్షించారు. నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ నుంచి అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా, అదనపు కలెక్టర్ చెన్నయ్య, ఆర్డీఓలతో కలిసి కలెక్టర్ హేమంత కేశవ్‌పాటీల్ వీసీకి హాజరయ్యారు. నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,15,824 మంది ఓటర్లకు నోటీసుల జనరేషన్ చేయగా.. ఇప్పటి వరకు 1,13,996 మంది ఓటర్లకు నోటీసులు అందించామన్నారు. నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల ధ్రువపత్రాలను స్వీకరించి, పరిశీలించి వెబ్‌సైట్లు అప్లోడ్ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు 32,553 మంది ఓటర్లకు హియరింగ్ నిర్వహించామన్నారు. సమావేశంలో ఆర్డీఓలు అర్చ న, బన్సీలాల్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
వరి కొనుగోళ్లపై ముందస్తు ఏర్పాట్లు
నాగర్‌కర్నూల్: వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టరు హేమంత్ కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోనిచోప్రా, అదనపు కలెక్టర్ చెన్నయ్యతో కలిసి వానాకాలం వరి కొనుగోళ్లపై ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానాకాలం వరి కొనుగోళ్లకు సంబంధించి జిల్లాలో అవసరమైన ప్రాంతాలను గుర్తించి కేంద్రా లు ఏర్పాటు చేయడంతో పాటు, తూకం యంత్రా లు, గన్నీ సంచులు, టార్ఫాలిన్లు, ధాన్యం నిల్వకు అవసరమైన ఇతర ఏర్పాట్లు, రవాణాకు అవసరమైన వాహనాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
రీసర్వే పకడ్బందీగా చేయాలి
నాగర్‌కర్నూల్ రూరల్: భూముల రీసర్వే ప్రక్రియలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా పకడ్బందీగా, నిర్ధేశిత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ హేమంత్ కేశవపాటిల్ అధికారులను ఆదేశించారు. మండలంలోని వెంకటాపూర్‌లో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే సమయంలో భూముల విస్తీర్ణం, సర్వే నంబర్లు, సరిహద్దులు, గ్రామ కంఠం తదితర వివరాలను క్షణ్ణంగా పరిశీలించి, సంబంధిత రికార్డులతో సరిపోల్చాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ తబితారాణి, సర్వే లాండ్ రికార్డు గిరిధర్, సర్వేయర్ పాల్గొన్నారు.


