ఉప్పునుంతల: మండలంలోని కొరటికల్‌లో నూతనంగా నిర్మించిన ఆలయంలో పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఆదివారం అమ్మవారి విగ్రహాన్ని ఊరేగించారు. అనంతరం భూషణ అయ్యవార్ల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో జలాభిషేకం, గణపతి హోమం, నవగ్రహ హోమంతోపాటు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో గ్రామానికి చెందిన టీ–శాట్ సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. సోమవారం పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. బుధవారం అమ్మవారికి బోనాలు నిర్వహించనునట్లు తెలిపారు.


