పాతాళానికి జలమట్టాలు | - | Sakshi
Sakshi News home page

పాతాళానికి జలమట్టాలు

Sep 7 2026 7:21 AM | Updated on Sep 7 2026 7:21 AM

కేఎల్‌ఐ నీటితో..

స్థానికంగా ఆశించిన వర్షాలు లేకపోయినా ఇటీవల కేఎల్‌ఐ సాగునీరు విడుదల చేయడంతో రైతులు వరి సాగు చేశారు. కాల్వనీరు ఆగిపోతే వరి సాగు చేతికొచ్చేది కష్టమే. మరోపక్క రైతులు వేరుశనగ సాగు చేసేందుకు దుక్కులు సిద్ధం చేశారు. నైరుతి రుతుపవనాలకు మిగిలింది సెప్టెంబర్‌ నెలే. ఈ నెల సైతం వర్షాలు కష్టమేనని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో రైతులు పంట సాగు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

వర్షపాతంలో భారీ వ్యత్యాసం

వర్షపాతంలో మండలాల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. పెద్దకొత్తపల్లి మండలంలో సాధారణ వర్షపాతం 348.1 మి.మీ. కాగా కేవలం 139.7 మి.మీ. నమోదై 60 శాతం లోటు ఏర్పడింది. కొల్లాపూర్‌లో 52, పదరలో 51, పెంట్లవెల్లిలో 51, అమ్రాబాద్‌లో 39 శాతం లోటు ఉంది. కల్వకుర్తి, తిమ్మాజిపేట, వెల్దండ, బిజినేపల్లి మండలాల్లో గణనీయమైన లోటు నమోదైంది.

నాగర్‌కర్నూల్‌: ఎల్‌నినో ప్రభావం జిల్లాను తీవ్రంగా వేధిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్నా లోటు వర్షపాతమే నమోదైంది. దీంతో చెరువులు, కుంటలు, వాగుల్లోకి ఆశించిన స్థాయిలో నీరు చేరకపోవడంతో భూగర్భ జలాల రీచార్జి కూడా మందగించింది. ఫలితంగా బోర్లు, బావులపైనే ఆధారపడి సాగు చేస్తున్న రైతులకు రానున్న రోజుల్లో నీటి లభ్యతపై ఆందోళన మొదలైంది. ఇప్పటికే వర్షాలపై ఆధారపడి సాగుచేసిన పత్తి, జొన్న, కంది పంటలు వాడుముఖం పట్టాయి. కొన్ని చోట్ల పూర్తిగా ఎండిపోతున్నాయి. స్ప్రింక్లర్ల సహాయంతో కొందరు రైతులు నీరుపారిస్తూ పంట దక్కించుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.

239.6 మి.మీ. వర్షపాతమే..

జిల్లాలో సాధారణం కంటే 28 శాతం తక్కువ వర్షపాతం, భూగర్భ జలమట్టం 7.17 మీటర్ల లోతుకు..

గతేడాదితో పోలిస్తే 3.72 మీటర్ల క్షీణత

పెద్దకొత్తపల్లిలో 60 శాతం వర్షపాతం లోటు

అమ్రాబాద్‌లో 12.05 మీటర్ల లోతుకు నీరు

ఆందోళనలో అన్నదాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement