అచ్చంపేటను అగ్రగామిగా నిలపడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అచ్చంపేటను అగ్రగామిగా నిలపడమే లక్ష్యం

Sep 7 2026 7:21 AM | Updated on Sep 7 2026 7:21 AM

అచ్చంపేట రూరల్‌: సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో అచ్చంపేటను రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా నిలుపుతానని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మండలంలోని హాజీపూ ర్‌ చౌరస్తా నుంచి అచ్చంపేట వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన గుర్తుచేస్తూ రేవంత్‌రెడ్డి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ బాకీ కార్డు చేత పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతిపక్ష నాయకుల కంటికి కనపడుతలేవా..? అని ప్రశ్నించారు. వెయ్యి రోజుల పాలనలో ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, కొత్త రేషన్‌ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత వి ద్యుత్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ వంటి పథకాలతో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement