సాగునీటిని వృథా చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

సాగునీటిని వృథా చేయొద్దు

Aug 21 2026 7:45 AM | Updated on Aug 21 2026 7:45 AM

నాగర్‌కర్నూల్‌ రూరల్‌: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రతినీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సాగునీటిని వృథా చేయొద్దని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన కల్వకుర్తి ఎతిపొతల పథకంలో భాగంగా నిర్మించిన డీ–8 కెనాల్‌ పరిధిలోని కాల్వలను బైక్‌పై తిరుగుతూ స్వయంగా పరిశీలించారు. తూడుకుర్తి దగ్గర ప్రధాన కాల్వ నుంచి సాకర్‌పల్లి– ఏదుట్ల, గోపాల్‌పేట, రేమద్దుల, సింగాయపల్లి తురకపల్లి, గోప్లాపూర్‌ వరకు కాల్వలను పరిశీలించి.. నీటి ప్రవాహం వల్ల కాల్వల పరిస్థితిని పర్యవేక్షించారు. కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు విడుదల చేస్తున్న నీరు, ఆయకట్టు పరిస్థితి గురించి సాగునీటి పారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి పారుదల శాఖ అధికారులు నిరంతరం కాల్వలను పర్యవేక్షించాలని ఆదేశించారు. నీరు వృథా కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంతోపాటు చివరి ఆయకట్టుకు సైతం సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మంత్రి వెంట వనపర్తి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గోవర్ధన్‌, కోడేరు మాజీ ఎంపీపీ రాంమోహన్‌రావు, సాగునీటి పారుదల శాఖ అధికారులు తదితరులున్నారు.

కేఎల్‌ఐ కాల్వను పరిశీలిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement