ఆరు గ్యారంటీల అమలు..
నీటిపారుదల రంగంలో..
నాగర్‌కర్నూల్
● సంక్షేమం, పారదర్శక పాలనే ధ్యేయంగా ముందుకు
● కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి ఫలాలు అందుకుంటున్న ప్రజలు
● రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
● అట్టహాసంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు
మద్యానికి గుడ్‌బై
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రామచంద్రాపూర్ గ్రామంలో మద్యపానం నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026
–8లో u
జాతీయ జెండాను
ఎగురవేస్తున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు
చిన్నారెడ్డి, చిత్రంలో ఎంపీ మల్లురవి, కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్, ఎమ్మెల్యేలు
రాజేష్‌రెడ్డి, వంశీకృష్ణ
తదితరులు
కందనూలు/ నాగర్‌కర్నూల్ రూరల్: జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో పాటుపడుతోందని, ప్రభుత్వం కేటాయించే నిధులతో జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేద్దామని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన 80వ స్వాతంత్య్ర వేడుకల్లో చిన్నారెడ్డితోపాటు ఎంపీ మల్లురవి, కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్, ఎమ్మెల్యేలు రాజేష్‌రెడ్డి, వంశీకృష్ణతో కలిసి పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సృష్టిస్తున్న సంపదను సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదికగా సమస్త ప్రజానీకానికి అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రణాళికాబద్ధమైన విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, ప్రజల సహకారంతో కందనూలును అన్నిరంగాల్లో ప్రగతి పథంలో నడిపించేందుకు కలిసికట్టుగా పయనిద్దామని పిలుపునిచ్చారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజా ప్రభుత్వం కంకణం కట్టుకుందని చిన్నారెడ్డి అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటికే దాదాపు 10.22 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారన్నారు. మహిళలు ప్రయాణ చార్జీల భారం తగ్గించుకొని దాదాపు రూ.482.15 కోట్లు ఆదా చేసుకున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ద్వారా ఏప్రిల్ నెల 2025 సంవత్సరం నుంచి రేషన్ కార్డు దారులందరికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున 2,79,133 రేషన్ కార్డులకు గాను 8,99,385 మంది కుటుంబ సభ్యులకు సన్నరకం బియ్యంను 552 రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. కులగణన, మీసేవ ద్వారా వచ్చిన 42,647 కొత్త దరఖాస్తులను గ్రామసభలో ఆమోదించుకొని 40,765 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగిందన్నారు. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత, భద్రత, సౌలభ్యం కల్పించేందుకు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు మంజూరు చేశామన్నారు. వీటికి లబ్ధిదారుల ఎంపిక చేసి త్వరలో మంజూరు పత్రాలు జారీ చేస్తామని వివరించారు.
మహాత్మగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి రూ.5,861 కోట్లు కేటాయించారని చిన్నారెడ్డి పేర్కొన్నారు. వీటితో అసంపూర్తి పనులు పూర్తయితే 4.51 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అలాగే మత్స్యశాఖలో ఇప్పటి వరకు 235 సహకార సంఘాలు ఉండగా 17,100 మంది సభ్యులు ఉన్నారని చెప్పారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో 900 మంది మత్స్యకారులకు ఏటా జీవనోపాధి కోసం లైసెన్స్ ఇస్తున్నామన్నారు.
మాతాశిశు సంరక్షణ ద్వారా 4,765 మంది గర్భిణులకు 12 వారాలలోపు నమోదు చేసి 4,032 మందికి టీడీ ఇంజెక్షన్లు ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు. సమగ్ర మహిళా ఆరోగ్యం పథకం కింద 8 రకాల స్కానింగ్ వైద్య పరీక్షలు నిర్వహించి కావాల్సిన వైద్య సహాయం అందిస్తున్నామన్నారు.
జిల్లాలో పాడి పరిశ్రమ ద్వారా రోజువారిగా 53,300 లీటర్లు పాలు ఉత్పత్తి అవుతున్నాయని, దీనిని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, పూర్వ ప్రాథమిక విద్య, రోగ నిరోధక శక్తి పెంపు సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
2025– 26 సంవత్సరంలో ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక ద్వారా 427 యూనిట్లకు యువత దరఖాస్తు చేసుకోగా 352 యూనిట్లు బ్యాంకు రుణాల ద్వారా సహాయం అందించినట్లు చెప్పారు.
ఉపాధి హామీ పథకం ద్వారా 55,08,85,000 మంది కూలీలకు 15.78 లక్షల పనిదినాలు కల్పించామన్నారు. సీ్త్రనిధి పథకం ద్వారా రూ.75 కోట్లకు పైగా రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు.


