నాగర్‌కర్నూల్ రూరల్: ప్రతిఒక్కరికీ చట్టాలపై, న్యాయ వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలని జిల్లా లీగల్ సర్వీసెస్ సెక్రెటరీ శ్రీదేవి అన్నారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని గగ్గలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవగాహన ఉంటేనే సమాజంలో నేరాలు జరగకుండా అరికట్టవచ్చన్నారు. అనంతరం విద్యార్థులకు బాల్య వివాహాలు, పోక్సో చట్టం గురించి వివరించారు. విద్యార్థి దశ అనేది భవిష్యత్‌కు బంగారు బాట వంటిదని, విద్యార్థులు అందరూ జీవితంలో గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం రాజశేఖర్‌రావు, న్యాయవాది శ్రీరామ్ ఆర్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


