వెల్దండ: రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం వెల్దండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నోట్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కట్టుబడి ఉన్నారన్నారు. అందులో భాగంగా ప్రభుత్వం నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందుతుందన్నారు. ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో సర్పంచ్ యాదమ్మ, వెంకటయ్యగౌడ్, భూపతిరెడ్డి, మోతీలాల్ నాయక్, పర్వత్‌రెడ్డి, బచ్చు రామకృష్ణ, శంకర్‌నాయక్, హరికిషన్‌నాయక్, కృష్ణ, ఎర్ర శ్రీను, భరత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


