నేటి కార్యక్రమాలు ఇలా..
● నేటినుంచి
స్మార్ట్ రేషన్‌కార్డులు పంపిణీ
● రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల
మంజూరు పత్రాల అందజేత
శనివారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2026
అచ్చంపేట: స్వాతంత్య్ర దినోత్సవం శనివారం పండుగ వాతావరణంలో కొనసాగనుంది. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులు అందరికీ నూతన పీడీఎస్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడంతోపాటు.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల ప్రొసీడింగ్స్ అందజేయనుంది. జిల్లాలో మొత్తం 2,59,984 ఆహార భద్రత కార్డులు ఉండగా.. 8,97,738 మంది లబ్ధిదారులు ఉన్నారు. కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి కొత్త కార్డులు అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. లామినేషన్ (పీవీసీ) రూపంలో అందించనున్న స్మార్ట్ రేషన్ కార్డు వాటర్ ప్రూఫ్, క్రెడిట్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డు పరిమాణంలో ఉంటుంది. అత్యంత ఆకర్షణీయంగా ఉండే ఈ స్మార్ట్ కార్డులపై క్యూఆర్ కోడ్‌తోపాటు ఆధునిక భద్రతా ప్రమాణాలను పొందుపరిచారు. కార్డుపై ప్రభుత్వ లోగో, పౌర సరఫరాల శాఖ పేరు ఉంటుంది. ముందు భాగంలో కార్డుదారుడి ఫొటో, వెనుక భాగంలో కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. రేషన్ దుకాణం నంబర్, డీలర్ వివరాలు, సివిల్ సప్లయింగ్ శాఖ టోల్ ఫ్రీ నంబరు, ఫిర్యాదుల కోసం వెబ్‌సైట్ వివరాలు ఉంటాయి. అత్యాధునికతతో తయారు చేసిన ఈ కార్డులను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు అందజేయనున్నారు.
రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే జిల్లాకు స్మార్ట్ కార్డులు చేరగా.. పంపిణీని ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేతులమీదుగా స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని శనివారం లాంఛనంగా ప్రారంభిస్తారు. లబ్ధిదారులందరికీ స్మార్ట్ కార్డులను దశల వారీగా అందిస్తారు. తొలిరోజు పంపిణీ తర్వాతే రేషన్‌షాపుల్లో కార్డులు అందిస్తారు.
– హేమంత కేశవ్ పాటిల్, కలెక్టర్
సొంతిల్లు లేని నిరుపేదలకు పంద్రాగస్టు రోజున రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. నియోజకవర్గానికి 2 వేల ఇళ్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈసారి పూరి గుడిసెలు, రేకుల ఇళ్లలో నివశిస్తున్న వారికి 1,500 ఇల్లు, అసంపూర్తిగా ఉన్న 500 ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా సర్వే చేసిన అధికారులు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక పూర్తిచేశారు.
I
I


