కఠినంగా శిక్షించాలి : ఎస్‌ఎఫ్‌ఐ | - | Sakshi
Sakshi News home page

కఠినంగా శిక్షించాలి : ఎస్‌ఎఫ్‌ఐ

Aug 14 2026 7:50 AM | Updated on Aug 14 2026 7:50 AM

కఠినంగా శిక్షించాలి : ఎస్‌ఎఫ్‌ఐ

నాగర్‌కర్నూల్‌ రూరల్‌: మైనార్టీ గురుకుల విద్యాలయంలో విద్యార్థిని లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడు సయ్యద్‌ ఇమ్రాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి తారాసింగ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక మైనార్టీ గురుకుల ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు.. అనుచితంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. సదరు ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ, కిరణ్‌, నిఖిల్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement